Trump: అమెరికన్ పౌరులకు $5,000 చెక్కులా? 1 y ago
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ వ్యర్థ వ్యయాన్ని తగ్గించి మోసాలను వెలికి తీసే ప్రయత్నాలు చేస్తోంది. DOGE ద్వారా ఇప్పటివరకు 55 బిలియన్ డాలర్లు ఆదా చేసినట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పొదుపు మొత్తంలో 20% ప్రజలకు పంపిణీ చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. పన్ను చెల్లించే 79 మిలియన్ కుటుంబాలకు గరిష్టంగా $5,000 వరకు చెక్కులు అందే అవకాశం ఉంది.